నాసదీయ సూక్తం

ఋగ్వేదం – మండలం10

The Beginning of Universe

It was not clear to science even today what is the beginning of this Universe. Veda ( Rigveda expressed the nature of the beginning, its structure and character thousands of years ago) expression on the beginning is still appealing for today’s science or fiction. 
An expression of energy as matter

నాసాదాసీనో సదాసీత్ తదానీం నాసీద్రజో నొవ్యోమా పరో యత్కిమావారీవాహ కుహకస్య శర్మాన్భః కిమాసీత్ గహనం గభీరం – 1

ముందు సత్తుగానీ అసత్తు గానీ లేదు . భూమి గానీ ఆకాశం గానీ లేదు . అగాధమైన, గంభీరమైన వెల్లువ తో ఆవరించిన అనుభవం వుంది

There is nothing in the beginning – no existence of earth and sky. The whole is alone with its enitirity and completeness.

నమృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా అహ్న ఆసీత్ ప్రకేత హ అనీదవాతం స్వధయా తదేకం తస్మాధ్యాన్నన్న పరః కించనాస – 2

అప్పుడు మృత్యువు, అమృతము , రాత్రిమ్బవళ్ళు లేవు . శ్వాస లేని ఆ ఒక్కటి ఉన్నది . స్వయంగా అది తరువాత శ్వాసించింది . 

There is no life or death or eternity, night or day. There existed one without any breath. Later that One has started breathing.

వ్యాఖ్య – మనిషి తన శరీరమునుండి విశ్వకేంద్రం దాక శోధించి రెండూ ఒకటేనని అంతర్ద్రుష్టితో వ్యక్తిత్వాన్ని విస్తరించడం యోగం . దాన్ని తెలిపే జ్ఞానమే వేదం . మహర్షులు శాశ్వత తత్వాన్నీ కనుగొనడానికి చేసిన ప్రయత్నం ఇది .

దీనికి సమతుల్యత భావం , దాన్ని సాధించడానికి నిరంతరం ఇంద్రియ నిరోధం, మానసిక సంయమనం చేయాలని అర్థం చేసుకుని, ఆచరించి చెప్పిన మాటలే వేదం . ఈ క్రమంలో శరీరం ప్రకృతితో మమేకమై జీవించడం భోగం . ప్రకృతితో మమేకమై భోగించకుండ ఉండటం యోగం . అదే నిష్కామ కర్మయోగం . ఈ యోగంలో అశాశ్వతమైన శరీరం నుండి శాశ్వత తత్వమైన మనస్సుకు, బుద్ధికి , శక్తికి ఆవల, ఆదిలో వున్న ఏక తత్వం అనుభవానికి వస్తుంది . ముందు ఉన్నది అదే చివర చేరాల్సింది అదే .

తేడా మాత్రం చైతన్య రహితమైన ఆది నుండి చైతన్య సహితమైన ఆది లోనికి ప్రవేశించడమే జీవిత పరమార్థం .

ఈ గమనంలో చుట్టూ ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న శరీరాన్ని , కుటుంబాన్ని , సమాజాన్ని , ప్రపంచాన్ని, ప్రకృతిని , విశ్వాన్ని మనతోపాటు తీసుకుపోయే ప్రయత్నం గానీ లేదా ఆ విషయం చెప్పే ప్రయత్నం గానీ చెయ్యడం సాంఘిక ధర్మం . అది చేయకపోతె మనలోని ఛైతన్యం చుట్టూ ఉన్న ఆవరణతో సమతుల్యంగా , సంయమనంగా ఉండలేదు .

విడిగా దూరంగా ఉండాలనుకుంటే ఏ బంధము లేకుండా జీవితం గడపాలి . ఇతరులతో బంధం తగిలించుకొని పాటించకపోతే కర్మబంధమై తిరిగి కర్మకు కారణమౌతుంది . అందుకే వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచి చివరికి సన్యాసంతో ముక్తుడు కావాలని చెప్పారు . 

విశ్వ కేంద్రంగా ఉంటూ నిమిత్తమాత్రంగా ఉండడం శివ తత్వం . నిమిత్త మాత్రంగా ఉంటూ ప్రకృతితో ప్రకృతిలో సంయమనంగా ఉంటూ సమతుల్యతా క్రియ చేయడం విష్ణు తత్వం . ఆది అంతము శివ తత్వమైతే మధ్య ఉన్న క్రియాశీలమైన  చైతన్యమే విష్ణు తత్వం . 

చైతన్యం విడిగా ఉన్నంతవరకు విష్ణు తత్వం అవసరం అవుతుంది . చైతన్యం శివశక్తి లేక స్థితి శక్తిలోనికి ఐక్యం కాగానే నిశ్చలమైన శివ తత్వమై ప్రకాశిస్తుంది . జీవిలో చైతన్యం ఉన్నంతవరకు విష్ణు తత్వం గ ఉండ క. తప్పదు.

శరీర బంధం ఉన్నంతవరకు కర్మ బంధం తప్పదు. జీవన్ముక్తుడు కావాలంటే శరీర బంధం నుండి జీవుని విడదీయాలి . వారికీ ఎటువంటి పాప పుణ్యాలు అంటవు

జీవుడు చైతన్యం , బుద్ధి, మనస్సు , ప్రాణం ద్వారా శరీరానికి అరిషడ్వార్గాలతో బంధించబడి ఉంటాడు . తిరిగి అదే క్రమంలో వాటిని విడదీసి జీవుడు తన స్వరూపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది . 

అరిషడ్వార్గాలను క్రమబద్ధమైన , ధర్మబద్ధమైన జీవితంతోనూ , ప్రాణాన్ని ప్రాణాయామంతోను , బుద్ధిని  ధారణతోను , మనస్సును ధ్యానంతో , చైతన్యాన్ని సమాధితోను నిలువరించాలి 

సంకల్పం జీవునితో మొదలై చైతన్యాన్ని ప్రేరేపించి  , భావంగ మారి , ప్రేరణగా మారి , ఆలోచనగా రూపుదిద్దుకుని, భాషగా , క్రియగ మారి మనకు కావలసిన మార్పుగా రూపాంతరం చెందుతుంది

తమ ఆసీత్ తమసా గూఢమాగ్రి ప్రకేతం సలిలమ్ సర్వమా ఇదంతుచ్యేనాభ్వాపిహితం యదాసీత్ తపసత్ తన్మహినాజాయతైకం – 3

ముందు యావత్తూ అంధకారంతో ఆవరించబడి గుర్తుపట్టలేని వెల్లువగా సమస్తాన్ని ఇముడ్చుకొని ఒక్కటే ఏదయితే ఉందొ అదే అభివ్యక్తమౌతున్నది

Everything is in the flow of complete darkness that emerged with its expression of what it is today.

అప్పుడు ఉన్నది స్త్రీ కాదు పురుషుడు కాదు . ఆ ఒక్కటీ అనిర్వచనీయమైనది . విశ్వం యొక్క ఈ స్థితి ఇప్పుడు చెప్పే బిగ్ బాంగ్ ను పోలి  ఉంది . అది చైతన్యాన్ని తనలో ఇముడ్చుకున్న స్థితి శక్తి . అందులోనుండి వెలువడిన చైతన్యం చరాచర పరాపర విశ్వంగా మారింది .

ప్రథమంగా ఉన్నది అంధకారమై  ఇప్పుడు కనపడే సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఒక ఆవరణగా ఉంది . ఈ స్థితి ఏది అని కనుక్కోవడానికి శాస్త్రాలు ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి . అందుకే ఋగ్వేదం దాన్ని అనిర్వచనీయమైనదని అన్నది. 

కామస్తదగ్రే సమవర్ధతాది మనసో రేతః ప్రథమం యదాసీత్ సతో బంధుంసతి నిరవిందన్ హృది ప్రతీప్యా కవయో మనీషా – 4

మనస్సు ప్రథమ రేతస్సుతో మొదట హృదయంనుండి ఆకాంక్ష అంకురించబడినదని తెలుసుకున్న ఋషులు సత్యానికి అసత్యానికి ఉన్న సంబంధాన్ని కనుగొన్నారు .

The First being with breath has began to desire to expand. The Vedic seers have understood this connection between the dream and reality, between the eternal and temporal, between the beginning and ending.

సత్యం అన్నది మూలం . అసత్యం అన్నది మూలం నుంచి వచ్చి తిరిగి అందులోనికి పోయేది అని అర్థం . సృష్టి పరంగానైనా శాస్త్ర పరంగానైనా ఈ నిజం ఒకటే . జగత్తులో ఒక్క మనిషి మాత్రం ఆ చైతన్యాన్ని గుర్తించి మూలంలోకూడా చైతన్యంగా వ్యవహరించగలుగుతాడు . ఆ చైతన్యం కలిగిన మనిషే దేవుడౌతాడు .

ఏ మనిషి ఇతరులకంటే శక్తిమంతుడు అయి ఇతరులకు ఉపయోగపడే కార్యం  చేస్తాడో అతడే దైవంగా భావిస్తున్నారు . తన్ను తాను తెలుసుకున్నవాడు మూలం చేరి విముక్తడవుతాడు . ఇతరులకు ఉపయోగపడితే  దేవుడవుతాడు . ఆ దేవుడు చేసిన కార్యంలో మహిమలు మాత్రమే కాదు , సమాజంలో ధర్మసంస్థాపన చేసినవాడు అది కూడ ప్రకృతిని శాసించి చేసినవాడు పరమోత్క్రుష్టమైన కృష్ష్ణుడుగా మారతాడు

స్థాయీ భేదాన్ని బట్టి ఎవరికీ వాళ్ళు దేవుళ్లను, దేవతలను ఆరాధిస్తున్నారు


Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.