Bala – The Primordial Force

Sree Bala Tripura Sundari

Photo Courtesy: Hindupad.com

ఆ పరాశక్తి లలితగా మానవ శరీరంలోని బ్రహ్మ రంధ్రం నుండి ప్రవేశించి జీవ శక్తిగా అతి వేగంగా వెన్ను పూస క్రింది భాగంలో ఉండే మూలాధారంలోనికి ప్రవేశించి సుప్త కుండలినిగా మారుతుంది . అప్పుడు ఆమె బాలా త్రిపుర సుందరి అవుతుంది . బాల అణు విస్ఫోటనా శక్తితో సమానమైన శక్తి కలిగి ఉంటుంది . ఆమెలోని అతి కొద్ది అంశం జీవ శక్తిగా మారి మనిషి జీవిత పర్యంతం జీవ చర్యలను నడుపుతూ ఉంటుంది .  ప్రాణాయామంతో ఆ కుండలిని రూపంలో ఉన్న బాలను జాగృతం చేస్తే సుషుమ్న లో తన ఊర్ధ్వ ప్రయాణం మొదలుపెడుతుంది . 

“వందే హం వనజాక్షిణాం వసుమతీమ్ వాగ్దేవతామ్ వైష్ణవీమ్ , శబ్ద బ్రహ్మమయీమ్ శశాంక వదనాం శాతోదరీమ్ శాంకరీమ్ 

షడ్బీజాం స శివామ్ సమంచితపదామ్ ఆధార చక్రే స్థితాం, చిద్రూపామ్ సకలేప్సితార్థ వరదాం బాలాం భజే శ్యామలాం !!”

పృథివీ తత్వంతో మూలాధారంలో శంకరిగా , వాగ్దేవిగా , వైష్ణవిగా చిద్రూపమై ( జ్ఞాన రూపం గా ) సకల కోరికలను తీర్చే శ్యామలగా వెలిగే ఓ బాలా నీకు వందనం ! 

Oh Baala! I bow to you who is in the personification of Syamala you are the united singular force of sankari , vaagdevi and vaishnavi in sequntial evolution at moolaadhara bestowing every wish to me. 

When universal energy takes the form of Lalita and enters as life force from the bramha randhra ( top portion of the brain ) and fast travels to the base of the spinal chord called moolaadhaara. Here she possesses enormous amount of energy but it is in sleep state. The little energy as tejas from here supports the life’s whole activities. At this point she is called Bala Tripura Sundari as she is in the primordial state of evolution. If one awakens her from the dormancy she starts journey upwards in spinal chord. Depending on the strength of concentration she unfolds physcial, psychical, intellectual, social  and spiritual capabilities of the practitioner.

The Energy and The Evolution

Sree Lalita

శరీర తత్వ శాస్త్రం, మానసిక తత్వ శాస్త్రం పాశ్చాత్య సంస్కృతి ఆలోచనకు రాని వేల సంవత్సరాలకు ముందే భారతీయ సనాతన తత్వం జీవ సృష్టి,  ప్రాణ సృష్టితో బుద్ధి ఏరకంగా వికసించిందో ఈ క్రింది పంచీకరణ శ్లోకం చెప్తున్నది. 

“అధా పంచీకృత మహాభూత రజో అంశ భాగత్రయ సమిష్ఠితః ప్రాణమసృజత్, ప్రాణాపానవ్యాన ఉదానః ప్రాణ వృత్తయ వచనాదాన, గమన విసర్గానందా తద్విషయ,  నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయా ఉపప్రాణా హృదయాసనాభిః కంఠ సర్వాంగాని స్థానః “

పంచ భూత సమిష్టిగా ఉన్న ఆ మహా మహాభూత తత్వం పంచీకృతంతో పంచ ప్రాణాలు,  వాటి వలన భాష (వచన విసర్గ విషయాదులు), జ్ఞానం, వాటిని వ్యక్తీకరించడానికి ఉపప్రాణాలు హృదయం,  నాభి, కంఠము మొదలైన అన్ని స్థానాలలో ఏర్పడుతున్నాయి అన్నారు. 

శృ ! ఆకాశాది రజోగుణాంశ తుర్యభాగేన కర్మేంద్రియాణ్యా సృజేత్,  వాక్పాణి పాద పాయో ఉపస్థ తద్వత్తయ, వచనాదాన గమనానంద విసర్గా తద్విషయా,  ఏవం భూత సత్వాంశ భాగ త్రయ సమిష్టితో అంతఃకరణమసృజత్, అంతఃకరణమనోబుద్ధి చిత్తాహంకారాస్తద్వృత్తయా, సంకల్ప నిశ్చయ స్మరణాభిమానా అనుసంధానా తద్విషయా గళ వదన నాభి హృదయ భ్రూమధ్యా ని స్థానాని” 

ఆకాశం వంటి రజోగుణ ప్రధానమైన తత్వాలతో వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ మొదలైన కర్మేంద్రియాలు ఏర్పడుతున్నాయి. సత్వ గుణ ప్రధానమైన అంశతో అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తం,  అహంకారం ఏర్పడుతున్నాయి. 

Even before the western philosophers like Aristotle, Socrates have expressed in human physiology and psychology and their origin and evolution, Indian Sanatana Dharma has explained the evolution of life and human beings. It says that one primordial force has transformed its existence as mahat from which has evolved the matter in forms ( earth,  fire, water, air and space ). These in various combinations has transformed into prana, buddhi, manas, ahamkaara. Out of praana as functional elements evolved sensory organs, voice and language to express the existence.

ఆది శక్తి నుండి విశ్వం ఎలా వచ్చింది అనడానికి ఈ క్రింది శ్లోకం వివరణ చూడండి .

అదే పరిలేఖనంలో మూల ప్రకృతి ఎలా వచ్చింది అనేదానికి ” తస్మిన్మరుశక్తికా స్థాణుస్ఫటికాదౌ జలరూప్య పురుష రేఖాదివ శుక్ల కృష్ణ గుణమయీ గుణసామ్యా ఆనిర్వాచ్య మూల ప్రకృతి ఆసీత్ ” ప్రథమ బిందువు నుండి చిత్ లేక చైతన్యం లేక నాదం ఎలా వచ్చిందంటే ఎడారిలో జలభ్రమలాగా, స్ఫటికంలో రేఖవలె, తాడులో సర్పం లాగా, దర్పణం లో ప్రతిబింబం లాగ సరిసమానమైన, అనిర్వచనీయమైన నిరంతరం మార్పునకు లోనయ్యే మూల ప్రకృతి ఆసీనమై ఉంది. అలాగే తత్తత్ ప్రతిబింబ ఈశ్వరచైతన్యం సస్స్వాధీనమాయ,  సర్వజ్ఞ, సృష్టిస్థితి లయానామాదికర్తా జగదంకుర రూపొ భవతి. అది తిరిగి ఏం చేస్తున్నదంటే తన స్వాధీనంలో తానున్న ఈశ్వర చైతన్యమై సర్వజ్ఞమై సృష్టి స్థితి లయాలకు ఆదిగా అంకురమై ఉంది. ఇంకా ” తస్మిన్విలీనం సకలం జగదావిర్భావయతి. అన్నీ విలీనం చేసుకొని జగత్తుగా ఆవిర్భవిస్తున్నది. ప్రాణి కర్మవశాత్ ఏష వటో యద్వత్ప్రసారిత, ప్రాణి కర్మ క్షయాత్పునః తిరోభావాయతి, తస్మిన్నేవ అఖిలం విశ్వం సంకుచిత వట వత్ వర్తతే. ఆ మూల ప్రకృతి లేక చైతన్య శక్తి జీవి కర్మ ఫలానికి తగినట్లు అశ్వర్థ వృక్షంగా ప్రసరించి విస్తరించి కర్మ శేషం అయిపోగానే తిరిగి అఖిల విశ్వాన్ని తనలో సమాయత్తం చేసుకొంటున్నది. 

ఇదే విషయం ఆధునిక ఖగోళ భౌతిక శాస్త్రంలో ఏ విధంగా నిరూపించారు. 

Sree Lalitaayai Namah!

We are driven by immense vital force from within which is the expression of continuous energy flowing across the energy. Identify, balance, stabilise and align with mind, breath, senses and body and their actions. As of now most of the activity in life is happening with less intention and chance. Hence we are subjected to the nature and surroundings. If you increase the intent to be independant of external physical forces and will to control everything that happens you can control the outcome of every action. Then this becomes the choice of existence in your life. It requires to identify the need, trigger the desire and passion to develop the will to balance the energy within. The present virus crisis has shown us the ways of body discipline through santization, social discipline through social distancing, aligning with the nature and away from its other forces that threaten our existence. It taght us the great philosophy of being simple , living in isolation and resort to basic needs. It has given the context and scope to contemplate on our true existence i.e the energy within trying to balance and align itself with the energy outside. 

May the Goddess of Lalita within us awaken to keep us safe.

Who is the Ultimate Deity as per Indian Scriptures

The Goddess Sree Lalita

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.