
శాంతి మంత్రం
సహనా వవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై! తేజస్వినాధీతమస్తు మావిద్విషావహై !
పరస్పరం ద్వేషించుకొనకుండా మూల శక్తితో అధ్యయనం చేస్తూ ఉత్సహంగా పరిశ్రమించి మనలను అది రక్షించి పోషించి తేజోవంతం చేయుగాక !
ఓం శంనో మిత్ర శం వరుణః ! శంనో భవత్వర్యమా ! శంనా ఇంద్రో బృహస్పతిః ! శంనో విష్ణురురుక్రమః ! నమో బ్రాహ్మణే ! నమస్తే వాయో ! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ! త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ! ఋతం వదిష్యామి ! సత్యం వదిష్యామి ! తన్మావవతు ! తద్వక్తార మావారు ! అవతు మామ్ ! అవతు వక్తారం !
మిత్రుడు, వరుణుడు , ఆర్యముడు , ఇంద్రుడు , బృహస్పతి , విష్ణువు మాకు మెల్ చేయుగాక .బ్రహ్మకు నమస్కారం . ప్రత్యక్ష బ్రహ్మస్వరూపుడైన వాయుదేవునకు నమస్కారం . అదే సత్యం . వాయు రూపుడైన బ్రహ్మ నన్ను , ఆచార్యుని రక్షించుగాక .
ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః ! భద్రం పశ్యేమాక్షుభిర్యజత్రా ! స్థిరయ్ రంగై సుష్టువాగంసస్తనోభిహి ! వ్యశేమ దేవహితం యదాయుః ! స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః ! స్వస్తి న పూషా విశ్వవేదాహ ! స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి ! స్వస్తినో బృహస్పతిర్దధాతు !
దేవతలారా ! యజ్ఞనిర్వహణలోశరీరంతో శుభప్రదమైన వాటిని కళ్ళతో చూస్తూ , చెవులతో వింటూ పటువైన శరీరంతో మీ గానం చేస్తూ పూర్ణ ఆయిస్సును పొందుదుముగాక ; ప్రాచీన గురువులచే చెప్పబడిన సర్వజ్ఞుడైన పూషుడు ( సూర్యుడు ) మాకు అభ్యుదయం ఒసగుగాక ; అరిష్టాలను హరించే గరుడుడు మాకు అభ్యుదయం ఒసగుగాక ;బృహస్పతి మాకు అభ్యుదయం ఒసగుగాక !
ఓం యాశ్చన్దసామృషభో విశ్వరూపః ! ఛన్దోభ్యోద్యమ్రుతాద్ సంబభూవ ! స మెన్ద్రో మేధయా స్పృనోతు ! అమృతస్య దేవధారణో భూయాసం ! శరీరం మీ విచర్షణాం ! జివ్హా మే మధుమత్తమా ! కర్ణాభ్యాం భూరివిశృవం ! బ్రహ్మణః కోశోసి మేధయాపిహితః ! శ్రుతం మే గోపాయ !!
ఓం శాంతిః శాంతిః శాంతిః
అమృతమయమైన ( మరణం లేని స్థితిని )దైవాన్ని ధారణ చేసి అలాగే అవుదుము గాక ! సమస్తంలో ఉంటూ అమృతమయమైన వేదాలనుండి ఋషుల ద్వారా వచ్చిన నాదం నా మేధస్సును స్పృశించి అమృతధారణ చెయ్యనీ ! శరీరం ఆరోగ్యంగా ఉంటూ మంచి పలుకులు పలుకుతూ, వింటూ మర్చిపోయిన అమృతజ్ఞానాన్ని స్పష్టపరుచుగాక!
This is a self suggestion to keep all your faculties active and aware of the state beyond death which is timeless and eternal. They felt the faculties and natural forces as gods and wanted to integrate them to achieve an intended or visualised objective within the prayer.
యజ్ఞం మనిషికి బాహ్య సంకల్పానికి , అంతర సాధనకు, ప్రకృతి శుద్ధికి ఉపకరిస్తుంది . యజ్ఞం అంటే జీవితానికి ఉపయోగపడే కార్యం అని అర్థం .
ఓం తచ్ఛం యోరావృణీమహే ! గాతుమ్ యజ్ఞాయ ! గాతుమ్ యజ్ఞపతయే ! దైవీ స్వస్తిరస్తు నః ! స్వస్తిర్మానుష్యేభ్యహ ! ఊర్ధ్వం జిగాతు భేషజం ! శం నో అస్తు ద్విపదే ! శం చతుష్పదే !!
ఓం శాంతిః శాంతిః శాంతిః
జీవితం ఒక యజ్ఞం . సృష్టిలోని ప్రతి వస్తువు యజ్ఞ వస్తువే . అన్ని యజ్ఞాలకు మంగళం కలుగుగాక .
యజ్ఞం నిర్వర్తించేవారు యజ్ఞాన్ని చక్కగా నెరవేర్చేటట్టు సర్వానికి మంగళకరుడైన వానిని ప్రార్థిస్తాము . మానవులందరికీ మేలు కలిగేటట్టు , చెట్టుచేమలు నిటారుగా పెరిగేటట్లు . ద్విపద , చతుష్పాద జీవులన్నింటికే దేవతలు మేలు చేయుదురుగాక
యజ్ఞం చక్కగా నెరవేరడానికి యజ్ఞపతుల శ్రేయస్సుకు , మనుష్యుల మేలుకు , వృక్షాల పెరుగుదలకు , అన్ని జీవుల మనుగడకు దైవీ శక్తులను ప్రార్థిస్తాము .
ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః ! మాధ్వీ ర్నసన్తవోషధీ ! మధునక్తముతోషసి మధుమతిపార్థివమ్ రజః ! మధుద్యోరస్తు నః పితా ! మధుమాన్నో వనస్పతిమధుమాం ఆస్తు సూర్య ! మాధ్వీ ర్గావో భవంతున
ప్రకృతిలోని గాలి మాధుర్యంగా వీచుగాక , తండ్రి అయిన ఆకాశం మాధుర్యాన్ని వర్షించుగాక , నదులు తియ్యని నీటితో ప్రవహించుగాక మాకు మాధుర్యాన్ని వర్షింపచేయుగాక – గాలి, , చెట్టూ చేమలు పుష్టిగా ఉండుగాక , చెట్టూ చేమలకు అధిపతి అయిన చంద్రుడు తియ్యగా వర్షించుగాక , పశువులు , భూమి తియ్యదనాన్ని ఇచ్చుగాక , రాత్రి పగలు మాకు మాధుర్యాన్ని వర్షింపచేయుగాక .
ఓం వాఙమే మనసి ప్రతిష్ఠితః మనో మీ వాచి ప్రతిష్ఠితః మావిరావీర్మ ఏధి ! వేదస్య మ అనీస్తః ! శృతి మే మా ప్రహసీరనేనా ధీతేనాహోరాత్రాన్ సందధామృతం వదిష్యామి ! సత్యం వదిష్యామి తన్మావవతు ! తద్వక్తారమవతు ! మామవతు వక్తారమవతు వక్తారమ్
వాక్కు మనసులోనూ , మనస్సు వాక్కు లోనూ ప్రతిష్ఠితమవుగాక . ప్రకాశం నాలో ప్రతిష్ఠితమవుగాక . వేదార్థం నాకు అవగతం అవిగాక . నన్నుచేరిన వేదం నన్ను వీడకుండా ఉండుగాక . నేర్చుకున్నదాన్ని అహోరాత్రాలు అనుసంధానం చేయుదునుగాక . నేను ఋతాన్ని పారమార్థిక , వ్యావహారిక సత్యాన్ని పలుకుదును గాక . ఆ భగవంతుడు నన్ను నా గురువులను నిరంతరం కాపాడు గాక . ఎందుకంటే మేము ఆయన దారిని ప్రయాణిస్తాము .
వాక్కు , మనస్సు ఒక్కటిగా ఉంటె మనిషి కావలసింది సాధించగలుగుతారు . సమాజంలో గొప్ప పేరు సంపాదించుకొంటారు . తన అంతరాన్ని బాహ్యంగా ప్రవహింపచేసి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు . బాహ్యాంతరాలు ఒక్కటైతే మనిషి బ్రహ్మమై చరిస్తాడు . ప్రకృతిలో మమేకమై విశ్వపురుషుడుగా మనుగడ సాగిస్తాడు . దానికి మనస్సు , వాక్కు ఒక్కటి కావడం ముఖ్యం . వాటి ఐక్యంతో సత్య వాక్పరిపాలన , ధర్మాచరణతో కుటుంబం , సంఘం , ప్రకృతితో మమేకం అవుతాడు .
ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు శ్రోత్రమధో బలమిన్ద్రియాని చ సర్వాణి ! సర్వం బ్రమ్హౌపనిషదం మాహం బ్రహ్మనిరాకుర్యామ్ మా మా బ్రహ్మ నిరాకరోదానిరాకరణ మాస్త్వనిరాకరణం మే అస్తు ! తదన్నాత్మని నిరతే య ఉపనిషస్స్తు ధర్మాస్తే మయి సన్తుతే మయి సంతు
నా అవయవాలైన వాక్కు , ప్రాణం , కన్నులు ,శ్రోత్రం , బలం అన్ని ఇంద్రియాలు బలోపేతములగుగాక . నేను ఈ యావత్తూ ఒక్కటైన బ్రహ్మాండాన్ని , ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మాన్ని నిరాకరింపకుండునుగాక . బ్రహ్మ నన్ను నిరాకరింపకుండునుగాక . ఉపనిషత్తులలో చెప్పబడిన ఆత్మ యొక్క ఉత్తమ గుణాలు ఆ ఆత్మ యందు శ్రద్ద గల నా యందు ఉండు గాక .
శక్తివంతమైన ప్రాణం , వాక్కు , కన్ను , చెవి మొదలైన అవయవాలతో , శ్రద్ధతో ఉపనిషత్తులలలోని బ్రహ్మ గుణాలను నిరంతరం నాలో నిలిచి ఉండునట్లుగా ఉపాసిస్తాను .
ఆత్మ మనస్సుతో బాహ్య ప్రపంచాన్ని ఈ శరీరం సాధనం గా అనుభవిస్తుంది . దాన్ని నిగ్రహించకపోతే శరీరం మనస్సును ఆ పైని ఆత్మను కప్పేస్తుంది .
Control the motor nerves through sensory nerves and sensory nerves through the stimulus and stimulus through the feeling and feeling through the beginning of it.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే ! పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే !!
అది ( ఆది నుండి అంతం వరకు ఉండేది – శక్తి ) పూర్ణం , ఇది ( ఈ కనిపించి అనుభవానికి వచ్చే శరీరం, ప్రపంచం పూర్ణం . పూర్ణమైన ఆది శక్తి నుండి ఈ పూర్ణంగా ఉండే ప్రపంచం ఉద్భవించింది . ఈ పూర్ణమైన ప్రపంచాన్ని ఆ పూర్ణమైన ఆది అంతము లేని శక్తినుండి తీసివేస్తే ( లయమైనా , ప్రక్రుతి తత్వాలనుండి వచ్చిన ఈ శరీరం తిరిగి ప్రకృతిలోని పంచభూతాలలో లీనం కావడం – దాని తరువాత మిగిలేది అఖండ చైతన్యమే ) మిగిలేది పూర్ణమే .
ఇప్పుడున్నది , ఇంతకుముందున్నది , ఇక రాబోయేది అంతా పూర్ణమే కానీ శూన్యం కాదు ( ఇది బుద్ధత్వం కాదు నిత్య చైతన్యం – కనపడనిది శూన్యం కాదు . ఇప్పటి శాస్త్రం ప్రకారం కంటికి కనబడని డార్క్ ఎనర్జీ 82 శాతం ఉంది
)
Listen to the inner voice, reach the beginning of thought, Be at the Center , become, be the one with itself and everything with awareness.
ఈ శరీరం , ప్రపంచం అంతం , ఆరంభం ఐన పూర్ణ శక్తిని చైతన్యంగా తెలిసికొని దానిగా మారితే తిరిగి ప్రాజ్ఞుడుగా చైతన్యంలో లీనమౌతాము . ఇదంతా దాన్నుడి వచ్చింది కనుక ఇది కూడా పూర్ణమే . పూర్ణమంటే స్వతఃసిద్హమైన సృష్టి , స్థితి , లయ శక్తులు కలిగినది . స్థితి శక్తి నుండి పరిణామక్రమంలో చైతన్య శక్తిగా మారిన జీవి ఆది , అనంతమైన మూల శక్తిని తెలుసుకొని, అనుభవానికి తెచ్చుకొని పూర్తిగా మారేంతవరకు ఈ తపన ( ఏది కావాలో తెలియకుండా ఏదో కావాలనే తాపత్రయం ), తమస్సు ( నిస్తేజమైన స్థితి శక్తి లో నిలిచి పోవాలనే బద్ధకం – చైతనాన్ని ప్రాపంచిక లేక శరీర సుఖాలకు మళ్లించడం ) , ఘర్షణ ( స్థితి , చైతన్యాలకు లేక శరీరము బుద్ధికి మధ్య సంఘర్షణ జనన మరణ పర్యంతము , ఆ చక్రభ్రమణము ) తపస్సు ( స్థితి శక్తిని చైతన్యంతో, సాధనతో జనన మరణాలకు అతీతమైన శాశ్వత తత్వమైన ఆది లేక మూల తత్వం వైపు నడిపించడం ), త్యాగం నిత్య తత్వాన్ని శరీరం , దాని ప్రకృతి , సంఘ , కుటుంబ బంధనాలను నిష్కామ కర్మ యోగంతో విడదీసి శాశ్వత ఆనంద ఆది మరియు మూల తత్వంలో ఉండడం ) తప్పవు .
ఈ ప్రయాణంలో నిరంతరం జడ , చైతన్య శక్తుల సంయమనం , సమన్వయం జరగాలి . అది పరిణామ దిశగా అంటే నిస్తేజంగా జడ శక్తినుండి జాగృతి కలిగిన చైతన్య శక్తిలోనికి ప్రయాణించి శాశ్వతంగా ఉండడం . ఇది జరగక పొతే జాగృతి లేని జడశక్తిలోగానీ , అదుపులేని చైతన్యంలోగానీ తిరోగమన పరిణామ క్రమంలో కొట్టు మిట్టాడాల్సి వస్తుంది . ఈ సూత్రం ఆధారంగానే కర్మ , దానికి కావలసిన ధర్మం , జీవి తన ప్రయాణంలో ఈ శాశ్వత సత్యాన్ని తెలుసుకొని తరాలకు అందించిన జ్ఞానం ఏర్పడ్డాయి . ఆ తత్వానికి ముఖ్యమైన ప్రేరణ అందులోనుండి వచ్చిన ఇహ పరాలకు అతీతమైన ఆనందం ఉన్నాయి .
శాంతి సూక్తం – అధర్వవేదం
ప్రశాంతత ( అంతర , బాహ్య ) ను సాధించడానికి చేసే సంకల్పం ఇది . మనస్సునుండి అశాంతిని , చెడు ఆలోచనలను , మొహాన్ని తొలగిస్తే నిలబడేది శాంతమే . దీన్నే సాయణుడు ” అనిష్ట పరిహారణే సుఖప్రాప్తి రూపతా ” అంటూ అరిష్ట కారణమైన దానిని మనస్సునుండి , మనకు దగ్గరగా ఉండే దానిని తొలగిస్తే మిగిలేది సుఖమే అంటాడు .
మనిషి జీవితంలో మానసిక , శారీరిక సుఖానికి అవసరమైనది, దుఃఖ కారణమైనదానిని నిత్యం తెలుసుకొంటూ దుఃఖ కారణమైన ఆలోచనలను దూరంగా ఉంచితే లేక దుఃఖ కారణమైన పనులను ముందుగా ఊహించి నిలువరించగలిగితే సుఖమే మిగులుతుంది .
సూ ! ఓం శాన్తా దౌ శాన్తా పృథివీ శాన్త మిదముర్వన్తరిక్షం ! శాన్తా ఉదన్వతీరాపః శాంతా నః సంత్వోషధీ !!
Result aloud the hymns to reverberate the universe to create a positive feel, thought, action and result around the universe. This is the way to influence the universe and nature for any positive effects and to avert negative effects and balance the nature. But this is possible when we reach the Center of the universe in existence.
సూ ! ఓం శాంతాని పృథివీ రూపాణి శాంతం నో అస్తు కృతాకృతం ! శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శం ఆస్తు నః !!
ఆకాశం , భూమి , అంతరిక్షం , ప్రవహించే నదులూ , చెట్టూ చేమలు ప్రశాంతంగా ఉండు గాక
భూమి మీద ఉన్న సర్వ రూపాలూ , చేసిన చేసే చెయ్యబోయే పనులూ , గతించిన – వర్తమాన – భవిష్యత్తు ప్రశాంతంగా ఉండి సర్వమూ మనకు ప్రశాంతతను ఇచ్చు గాక .
సూ ! ఇయం యా పరమేష్టినీ వాగ్దేవీ బ్రహ్మ సంస్థితా ! యయైవ ససృజే ఘోరం తేనైవ శాంతిరస్తు నః !!
సమస్త పరిణామాలకు, ఘోర పరిణామాలకు కారణభూతురాలైన బ్రహ్మ నుండి ఉద్భవించిన ఆ వాగ్దేవి ప్రశాంతమై శాంతిని మనకు శాంతిని ప్రసాదించు గాక . అంటే మన మాటలే ప్రశాంతంగా ఉండకపోతే ఘోర పరిణామాలు తీసుకు వస్తాయి . కనుక నిత్యం మన నాలుకపై ఉన్న వాగ్దేవిని ప్రశాంతంగా ఉంచాలని చెప్పడం ( వ్యావహారికంలో చెప్పాలంటే నోటిని అదుపులో పెట్టుకోవడం ).
సూ ! ఇమాని యాని పంచేంద్రియాణి మనః షష్టాని మే హృది బ్రాహ్మణా సంశితాని ! యైరేవ ససృజే ఘోరం తైరేవ శాంతిరస్తు నః !!
సమస్త పరిణామాలకు , ఘోరాలకు కారణమైన బ్రహ్మ ప్రేరితమైన , హృదయం ద్వారా ఉత్పన్నమయ్యే పంచేంద్రియాలు , ఆరవ ఇంద్రియమైన మనస్సు ( ఇంద్రుడు ) మనకు ప్రశాతను చేకూర్చు గాక .
వాగ్దేవి ఆలోచనలకు కారణమైతే , పంచేంద్రియాలు మనస్సుతో కలిసి హృదయ ప్రేరణల ద్వారా సమస్త సంఘ పరిణామాలకు కారణమౌతున్నాయి . వాటిని అదుపులో ఉంచుకొని ఒక ఆదర్శ మనిషిగా ( రామునిగా జీవితం కొనసాగిస్తే ఎటువంటి ఒడిదుడుకులు రావు . వచ్చినా మనో ధైర్యంతో సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు .
సూ ! యాని కాని చిచ్చాన్తాని లోకే సప్త ఋషయో విదుః ! సర్వాణి శం భవంతు మే అస్త్వభయం మే అస్తు !!
లోకంలో ఉన్న శాంతి సాధనాలన్నిటినీ సప్తర్షులు తెలుసుకొని మనకు తెలియ చేసినారు . ఆ సాధనాలన్నీ మాకు అభయాన్ని ఇచ్చి మంగళాన్ని ప్రసాదించు గాక .
సూ ! పృథివీ శాన్తిరన్తరిక్షం శాంతి ద్యో శాంతిరాపః శాంతిరోషధయ శాంతిర్వనస్పతయ! శాంతిర్విశ్వే మే దేవాః శాంతిః సర్వే మే దేవాః శాంతిః శాంతిః శాంతిః శాంతిభిః ! తాభిః శాంతిభిః సర్వ శాంతిభిః శమయో మొహం యాదిహ ఘోరం యాదిహ క్రూరం యాదిహ పాపం తచ్చ శాంతం తచ్ఛివం ( తత్ శివమ్ ) సర్వమేవ శమస్తు నః !!
సృష్టి సమస్తం శాంతిని పొంది క్రూరము , ఘోరం , పాపము శాంతించి ( నశించి ) మాకు మంగళం ప్రసాదించు గాక .
సమస్త సృష్టి మన జీవనానికి మూల కారణంగా తెలుసుకొని , వాటికి అనుగుణంగా , సాధ్యమైతే వాటిని ఆధీనంలోకి తెచ్చుకొని శాంతంగా ఉంటూ మంగళకరమైన జీవితాన్ని గడపాలని , మానసిక , శారీరిక ఒత్తిడులను తగ్గించుకొని జీవితం ప్రశాంతంగా గడపాలని ఈ సూక్తం ఉద్దేశ్యం .
.