
నా! భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర ప్రహర్షితా! కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ! మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ! కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ! బ్రహ్మోపేత మహేంద్రాది దేవా సంస్తుత వైభవా ! హరనేత్రాగ్ని కామ సంజీవనౌషధి !!
నారాయణుని దశావతారాలను ( చేప, తాబేలు, వరాహం, నారసింహుడు, వామనుడు, పరుశురాముడు, రాముడు, బలరాముడు, కృష్ణుడు, కల్కి మొదలైన దశావతారాలు ) తన కుడి చేతి బొటనవేలి గోటి నుండి ఎడమ చేయి చిటికెన వేలితో ఉత్పన్నం చేసి భండాసురుని శాస్త్రాలను ( తన పదార్థ వికృతి అయిన భండాసురుని చేత సృష్టించబడ్డ సర్వాసుర శస్త్రం వలన సోమక రావణ, బలి, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, శిశుపాల, దంతవక్త్రులనే అసుర వృత్తులను ) తన ప్రత్యస్త్రాలతో ( నారాయణ దశ దైవీయ వృత్తులు లేక పూర్ణ పరిణామ సంకల్ప చైతన్య ప్రకృతి శక్తి ) భగ్నం చేయగా మహాపాశుపతం ( పశువుకు లేక పశు లేక అసుర లక్షణాలతో పదార్థ నిర్మితమైన మాయను లేక పదార్థ బంధాన్ని కామేశ్వరుడ ఆ కామేశ్వరి క్రీగంటి చూపుతో జాగరూకుడై ఆ పశువుని నిర్జించే అస్త్రంగా మారి ) తో మాయకు బంధానికి కారణమై, తమోగుణ ప్రధానంగా అరిషడ్వర్గ సమన్వితుడైన ఆ భండాసురుణ్ణి దగ్ధం చేసి లేకుండా చేసి దేవి ఆధీనంలోనికి వచ్చి సమతుల్యతా రాగం పాడుతున్నాడు. అది చూసి సుషుమ్న ఊర్ధ్వ భాగంలో రజో సత్వ గుణాధిక్యత కలిగిన ఇంద్ర బ్రంహేంద్రాది దైవ స్వరూపులు తమ సమతుల్య పురోగమన అస్తిత్వానికి అడ్డంకులు తొలిగాయని ఆ లలితను కామేశ్వరున్ని స్తుతిస్తున్నారు. హరుని నేత్రాగ్నికి దగ్ధమైన కాముని సంజీవ ఔషధాన్ని ఇచ్చి ఆ లలితే తిరిగి జన్మనిచ్చింది. ఆంటే ఆ లలిత తన పదార్థ శరీరంలో క్రోధాగ్ని వలన జరిగే అనర్థాలను ( మరణంతో సహ ) సవరించి తిరిగి సమతుల్యం చేసుకొంటుంది ఆని అర్థం. తన స్వస్వరూపం అనే ఔషధంతో తిరిగి జీవం పోస్తున్నది.
రుద్రుని నుండి పశువు వరకు ఉన్న తత్వాలను పశువు అంటారు. అటువంటి తత్వాలతో పదార్థంతో నిర్మితమైన శరీరమైన ఆ శివుణ్ణి పశుపతి అన్నారు. పశుపతి తనలోని పశు తత్వాన్ని మహాపాశుపతామనే బుద్ధి క్రియతో నశింప చేయగానే అసుర సంహారం జరిగింది. త్రిపురాలను ( శరీరం, బుద్ధి, ఆత్మ లేక జీవుడు )అధిష్టించి ఉన్న త్రిపురాసురుణ్ణి లేక తారకాసురుని సంహరించడానికి లేక త్రిపుటిని సాధించడానికి దేవి తో ఐక్యమై కుమార స్వామి జనించిన తార్కాణం కూడా ఇదే. శివుడనే తన శరీరాన్ని ప్రారబ్ధం తీరగానే తన సమతుల్య స్థిర శాశ్వత అస్తిత్వంలో భాగస్వామిని చేసుకొంటున్నది. తానూ తన చైతన్య విహారాన్నుండి స్వస్థత పొందుతున్నది. ఆ తల్లి తన స్థితి చైతన్య రూపాల మధ్య నిత్య నిరంతర సమతుల్యత ను ( ఆంటే తన ఎలెక్ట్రాన్ లో ఉన్న చైతన్యంతో ప్రోటాన్ ల పదార్థ నిర్మాణం చేసి ఎప్పుడూ రెండింటి సమతుల్యతను న్యూట్రాన్ లాగ స్థిరపరుస్తూ ఉంటుంది. ఇదే ఆమె శాశ్వత అస్తిత్వ ఇఛ్ఛా జ్ఞాన క్రియా చర్యలు. ఆయా సాధకులను బట్టి తన చేయి అందించి తన స్థాయికి చేరుకోవడానికి సహాయం చేస్తుంది. కామేశ్వరుడు అనే ఈ శరీరంలో ఉన్న ఈశ్వరుడు తన కోపంతో తనలోని కామాన్ని ఇచ్ఛను కూడా సాధనలో దగ్ధం చేసినప్పుడు ఆ పరాశక్తి తిరిగి ఆ ఇఛ్ఛా రూపాన్ని సరి చేసి సమతుల్యం చేసుకొంటుంది. బృహదారణ్యకోపనిషత్ చెప్పినట్లు నేను అనే జీవాత్మ పదార్థ శరీర బంధ భండాసురుడుగా మారినప్పుడు నేను వేరు ఆ సత్ వస్తువు వేరు అనే భావన, శరీరం వేరు బుద్ధి వేరు అనే భావనతో పతన దశకు చేరుకొంటాడు. ఆ దశలో అసుర శక్తులుగా అరిషద్వర్గాలను, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి పాశబద్ధుడవుతాడు. ఆ దేవీ దర్శనం వలన కామేశ్వరుని ఇచ్ఛ నుండి బయలుదేరి పతనమైన ( బంధ శరీరంతో ఉన్న భండాసురుడు అతని సైన్యం వికృతి రూపాలు ) భండాసుర సైన్యం తిరిగి వాటి మొదటి శుద్ధ రూపానికి వచ్చి జీవాత్మలో సుషుప్తంగా ఉంటాయి. హరి వలన సంహారం జరిగితే హరుడు కాపాడతాడు, హరునివలన మరణం సంభవిస్తే ఆ జగదీశ్వరి, విశ్వంలో ప్రథమ గురువు అయిన ఆ శ్రీ లలిత సృష్టిని sసమతుల్యం చేస్తున్నది ఆని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. యోగినీ హృదయంలో చెప్పినట్లు ఆ శివుడు ” నా ఇచ్చా శక్తిగా ఉన్న ఓ పరమేశ్వరీ ! ఈ అతీంద్రియ జ్ఞానం అనర్హులకు చెప్తే దుర్వినియోగమవుతుంది ఆని నీవే చెప్పావు ” అంటున్నాడు. చతుశ్శష్టి శాస్త్రం చెప్పినట్లు శక్తి లేకపోతే శివుడు లేడు అతనికి ఈ శరీరము లేదు. శరీరమున్నా అంతర్గత ఆత్మ చైతన్య స్వరూపమై ఈ జీవ అస్తిత్వానికి గురువుగా నిత్యం సందేశాన్ని బుద్ధి రూపంలో జ్ఞానమై కాపాడుతున్నది ఆ పరాశక్తే.ఆ పరాశక్తి సృష్టి చేసిన సదాశివుడు ప్రకాశ అంశ (శివుడు)గురువుగా, విమర్శ ( పార్వతి ) శిష్యురాలిగా కనబడుతున్నారు ఆని తంత్ర శాస్త్ర వాదన. సదాశివునిలో ఉన్న ఇచ్చా శక్తియే సృష్టి దానికి కారణమైన జ్ఞానాన్ని ఇస్తున్నది. కాని ఆ ఆది శక్తి ఇఛ్ఛగా, సదాశివుడు శరీరం అయినప్పుడు కనబడే శరీరం శివుడే కనుక ఆ శివుడు దృశ్య ప్రపంచానికి గురువుగా కనబడుతున్నాడు. ఆ పరాశక్తి స్త్రీ రూపమై పార్వతిగా మారి ఆది గురువుకు ప్రథమ శిష్యురాలు ఇతరులకు ఆంటే బ్రహ్మ విష్ణులకు మొదటి గురువు అవుతున్నది. హర ఆంటే పదార్థ బంధంతో కూడిన అజ్ఞానాన్ని హరించే వాడు ఆని అర్థం అంతే గానీ సృష్టి లయకారకుడు కాదు. సృష్టిలో లయం పొందేవాడు పదార్థ లేక శరీర రూపమైన శివుడు. ఆ లయాన్ని సృష్టించి తిరిగి సృష్టి స్థితులను కలిగించేది ఆ పరాశక్తి. అవిద్యకు కారణమైన భండాసుర ఉత్పత్తి ఆ భండాసురుని వధించడానికి విద్యతో, సాధనతో, కుండలిని జాగృతిలో దివ్య శక్తి రూపాలైన దేవతలు ఆమెనే. అదే తత్ త్వం ఆసి. ఒక్క కుండలిని జాగృతమైతే సర్వ అసుర సంహారం జరిగి అవిద్య విద్యగా మారుతుంది. సాధకుడు చేయాల్సింది కుండలినిని జాగృతం చేసి నిత్యం దానిపై ధారణ, ధ్యాన తాదాత్మ్యం ( సమాధి ) పొందుతూ ఆ శక్తి తిరిగి శరీర బంధనానికి పతనానికి కారణమైన అరిషడ్వర్గ ప్రభావాలకు లోను కాకుండా తన ఉత్తానాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇది కుండలిని సుషుమ్న ఊర్ధ్వ ప్రస్థానం తో జరుగుతుంది.
ఎనిమిది త్రికోణాలలో ఎనిమిది త్రిశూలాలు కలిగి అష్ట దిక్పాలకులతో రక్షింప బడుతున్న జయ విఘ్నమనే యంత్రం పైకి విశుక్రుడు దాడి చేసిన రాతి అస్త్రాలను విఘ్నేశ్వరుడు పటాపంచలు చేశాడు. ఇక్కడ విఘ్నేశ్వరుడు కామేశ్వర కామేశ్వరీ సంగమ స్థితిలో ఉదయించిన మరొక శివశక్తి అంశ మాత్రమే. ఈ శక్తిని ఉపయోగించి స్థిరత్వానికి భంగం కలిగించే అసుర వృతులను జయించాలి కాని జీవిత కాలం కేవల బాహ్య పూజలు కథల వలన ప్రయోజనం లేదు. ఆ పూజల కథల అంతరార్థం కూడా ఇదే. ఈ అర్థ జ్ఞానాన్ని ఉపయోగించుకొని సాధనతో స్వభావ వృత్తులను మార్చుకొని స్థిరత్వం వైపు సమతుల్య సంకల్పంతో ప్రయాణించడమే విఘ్నేశ్వర తత్వం అంతరార్థం. అటువంటి విఘ్నేశ్వర ఉదయం మనలో కలగాలని మనలో కామేశ్వర కామేశ్వరి సంగమ రూపానికి “ఓం నమో విఘ్నేశ్వరాయ నమః !” ఆని ప్రార్థించి నిరంతరం ప్రకృతితో మమేకమై శరీర మానసిక రుగ్మతల నుండి బయటపడాలి.
ధనుర్వేదం ప్రకారం శస్త్రం ఆంటే తన చేతిలో ఉన్న ఆయుధంతో (కత్తి లాంటివి )శత్రువుపై యుద్ధం చేయడం, అస్త్రం ఆంటే తన చేతి నుండి విసిరే బాణం లాంటి ఆయుధాలు ఆని అర్థం. మహాగణేశుడు ఆంటే ఈశ్వరుడు శక్తితో కలిసి విఘ్నేశ్వరుడై పుర్యష్టకాలతో ఆవరించి ఉన్న అసుర ప్రవృత్తిలో ఉన్న శరీరం ( అవిద్యతో ఆవరించియున్న భండాసుర ప్రవృత్తి ) పై విజయం సాధించి తన స్వస్వరూపమైన, జ్ఞాన విద్యా స్వరూపమైన ఆ పరమేశ్వరీ పరమేశ్వరులని గుర్తించి జీవించడం. ఆ దేవి ఆగని శస్త్రాస్త్ర ప్రయోగం చేస్తున్నది ఆంటే స్వస్వరూప సాధన ఆగకుండా జాగరూకులై పశు అసుర ప్రవృత్తులను జయిస్తూ స్థిర సంతులిత చైతన్య స్థితిని చేరడం.